ఎంపీ వద్దిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం ప్రముఖులు

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు  24/01/2026

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి.హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న ఎంపీ రవిచంద్రకు పలువురు ప్రముఖులు,యువత, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు.పుట్టినరోజు సందర్భంగా ప్రధాన వేడుకలు జరిగే బురహాన్ పురంలోని తన క్యాంప్ కార్యాలయానికి ఎంపీ రవిచంద్ర విచ్చేయగా టపాకాయలు కాల్చుతూ, పూలవాన కురుపిస్తూ,”జై రవన్న జైజై రవన్న”,”వర్థిల్లాల్లి వర్థిల్లాలి వద్దిరాజు రవన్న నాయకత్వం వర్థిల్లాలి”,”హ్యాపీ బర్త్ డే రవన్న”,'”లాంగ్ లివ్ లాంగ్ లివ్ రవన్న లాంగ్ లివ్”అని నినాదాలిస్తూ యువత, కోలాటం ఆడుతూ,పాటలు పాడుతూ మహిళలు అపూర్వ స్వాగతం పలికారు.ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశానికి మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ సమన్వయకర్తగా వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు,బచ్చు విజయ్ కుమార్ తదితర ప్రముఖులు హాజరై ఎంపీ రవిచంద్రను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రముఖ వ్యాపారవేత్తలు పారా నాగేశ్వరరావు,జాబిశెట్టి శ్రీనివాసరావు,తీగల విజయ్,పారా ఉదయ్ తదితర ప్రముఖులు ఎంపీ రవిచంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.సీనియర్ జర్నలిస్ట్ ఆకుతోట ఆదినారాయణ, వెంపటి నాయుడు  టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోట రామారావు,లక్కినేని రఘు,శీలంశెట్టి వీరభద్రం, మిక్కిలినేని నరేందర్,రంగిశెట్టి కోటేశ్వరరావు, తోట రమేష్ తదితర ప్రముఖులు ఎంపీ రవిచంద్రను గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పారు.అలాగే, కాంగ్రెస్ నాయకులు పసుపులేటి దేవేందర్,పొదిల రవికుమార్,కనిశెట్టి నర్సయ్య, పగడాల మంజుల,అడప హారిక,విప్లవ్ కుమార్,సీవీఏల్ నర్సింహారావు తదితరులు ఎంపీ రవిచంద్రను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.మునిసిపల్ కార్పోరేటర్స్ కర్నాటి కృష్ణ, జ్యోతిరెడ్డి, వ్యాపారవేత్తలు మెంతుల శ్రీశైలం,ఎర్రా అప్పారావు,ముత్యం ఉప్పల్ రావు,మడూరి పూర్ణ తదితర ప్రముఖులు ఎంపీ వద్దిరాజుకు పుష్పగుచ్ఛాలిచ్చి శాలువాలు కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా జంగిలి రమణ (బీజేపీ),మరిశెట్టి వెంకటేశ్వర రావు (సీపీఐ)లు ఎంపీ రవిచంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.ఎంపీ వద్దిరాజు చిరకాల అభిమానులు జిళ్లపల్లి ఉపేందర్,ఆలేటి వెంకటప్పయ్య, ఆకుల సురేష్ ,గాయత్రి మానసిక దివ్యాంగుల సంస్థ నిర్వాహకులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యాన పలువురు చిన్నారులు కార్యక్రమానికి హాజరై ఎంపీ రవిచంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా రవి అన్న యువసేన,వద్దిరాజు రవన్న యూత్ సభ్యులు ఎంపీ రవిచంద్రను గజమాలతో సన్మానించి భారీ కేక్స్ కట్ చేయించారు.తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీ వద్దిరాజు సుమారు 4వేల మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed