ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జనవరి 23
హస్తం గూటికి చేరిన వారికి హస్తమే వారి నెత్తిన బస్మాసురా హస్తం అవుతుంది..మాజీ మంత్రి పువ్వాడ..
ఖమ్మం నగరంలో 17,34 డివిజన్ల నందు జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో అజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో మోసం చేసి వెళ్ళిపోయిన వారికి ప్రజలే బుద్ది చెపుతారని అన్నారు.
బిఆర్ఎస్ విడిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన వారిని అడుగుతున్నా మీరు అధికార పార్టీలోకి పోయారు కదా మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు పేదలకు ఇప్పించే సత్తా ఉందా అని ప్రశ్నించారు.
నేను మంత్రిగా సమయంలో ఏంతో మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాను.ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేసారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఖమ్మంలో నేను చేసిన అభివృద్దే తప్ప వేరే కొత్తగా చేసింది ఏమి లేదని ఏద్దేవా చేశారు.
ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులు సింగరేణి మరియు ఇతర కాంట్రాక్టుల విషయాలలో వారే పంచాయతీలు పెట్టుకొని విమర్శలు చేసుకుంటున్నారు.ఇంకా వారు ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు.
నా మీద అవాకులు చవాకులు మాట్లాడిన వారికి ప్రజలే బుద్ది చెపుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,
మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,మాజీ మార్కెట్ చైర్మన్ గుండాల కృష్ణ,ప్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ,మాజీ గ్రంధాలయం చైర్మన్ ఖమర్,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,డిప్యూటీ ప్లోర్ లీడర్ మక్బుల్ కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు,పసుమర్తి రామ్మోహన్,జ్యోతి రెడ్డి,ముక్కాల రాజేష్,మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి,నాయకులు మెంతుల శ్రీశైలం,పల్లా రాజశేఖర్,బండి నవీన్,
మందడపు రామకృష్ణ,ఖయ్యుమ్,
పాలడుగు పాపారావు,ఎర్రా అప్పారావు, గౌరోజు వసంత్,కనకం భద్రయ్య,బోజెండ్ల రామ్మోహన్,
మస్తాన్,పాషా,లెలిన్ చౌదరి,
షకీనా,మాటేటి కిరణ్,రాంబాబు, మహేందర్,శరత్,లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.





