ఖమ్మం *మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు డిసెంబర్ 20*

ఉత్తర, దక్షిణ భారత దేశానికి అనుసంధానం ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి … రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు

కొత్త సంవత్సరంలో సంతోషదాకరమైన ట్రాపీక్ ఫ్రీ నేషనల్ హైవే ప్రయాణం

సంక్రాంతి నాటికి ఒకవైపు ధంసలాపురం ఆర్.ఓ.బి. పూర్తి

ధంసలాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే, ఆర్.ఓ.బీ నిర్మాణ పనులను కలెక్టర్ తో కలిసి తనిఖీ చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం, డిసెంబర్ -20

ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం తో పాటు ఉత్తర భారతదేశం, దక్షిణ భారత దేశానికి అనుసంధానం చేసే ప్రత్యేక మార్గంగా మారబోతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

మంత్రివర్యులు, శనివారం ధంసలాపురం వద్ద ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను తనిఖీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఆర్ఓబి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను, మున్నేరు బ్రిడ్జి వంతెన పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పై మంత్రి, అధికారులకు పపలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలని అన్నారు. 160 కిలోమీటర్ల జాతీయ రహదారి పూర్తి కావడం వల్ల గంటన్నర సమయంలో రాజమండ్రి వెళ్ళవచ్చని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇక్కడి వారికి ఈ రోడ్డు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే రహదారిగా తయారవుతుందని అన్నారు. ధంసలాపురం ఆరోఓబి సంక్రాంతి నాటికి పూర్తి అవుతుందని మంత్రి తెలిపారు.

ఆర్.ఓ.బి. నిర్మాణానికి సంబంధించి హై టెన్షన్ విద్యుత్ లైన్స్ తరలింపు, భూసేకరణ వంటి అన్ని పనులు పూర్తి చేశామని, ఒకవైపు రైల్వే బ్రిడ్జి పూర్తి చేసుకుంటే సత్తుపల్లి, రాజమండ్రి వరకు ఉపయోగపడుతుందని అన్నారు.

ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు సంక్రాంతి నాటికి పూర్తియితే హైదరాబాద్ నుండి రాజమండ్రి వైజాగ్ వెళ్ళే వారు విజయవాడ వెళ్లకుండా ఖమ్మం దేవరపల్లి హైవే పై 150 కిలో మీటర్ల ప్రయాణం ఆదా అవుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో నేషనల్ హైవే లు ప్రగతి బాటలు వేస్తాయి మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

కొత్త సంవత్సరంలో సంక్రాంతి నాటికి ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావాలని అన్నారు. రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ఆర్ఓబీ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రైల్వే, కెనాల్, మున్నేరు పై రహదారి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

మున్నేరు బ్రిడ్జ్ తో పాటు ధంసలాపురం ఎగ్జిట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. 3500 కోట్లతో ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి నిర్మిస్తున్నామని అన్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి చిన్న, చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అన్నారు.

కొత్తసంవత్సరంలో కొత్త నేషనల్ హైవ్ పై ప్రయాణం సంతోషదాయకంగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్పొరేటర్లు, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed