ఖమ్మం జిల్లా గ్రానైట్ అండ్ టైల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, ఎలక్ట్రీషన్స్ యూనియన్ అధ్యక్షుడు గోవర్థన్ లను సత్కరించిన మున్నూరుకాపు నాయకులు*
ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడ మే 30,ఖమ్మం;శుక్రవారం సాయంత్రం ఖమ్మం జిల్లా గ్రానైట్ అండ్ టైల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెడ్డు రమేష్, ఎలక్ట్రీషన్స్ యూనియన్ అధ్యక్షుడిగా ముత్యాల గోవర్థన్ లు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన సందర్భంగా ఇరువురిని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ,రిటైర్డ్ పోలీస్ అధికారి కేదాసు నర్సయ్య,ప్రలపనేని నాగయ్యల ఆధ్వర్యాన 4,5,6 డివిజన్లకు చెందిన మున్నూరుకాపు ప్రముఖులు ఘనంగా సన్మానించారు.రమేష్,గోవర్థన్ లు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కర్నాటి సోమయ్య, కొలనుపాక యుగంధర్,ప్రముఖ న్యాయవాది మూలగుండ్ల శ్రీధర్,గోగం సురేష్,ద్రాక్షపల్లి రాంచందర్, బొగ్గారపు మల్లేష్ రావు, ముత్యాల శ్రీకాంత్,మహేష్ తదితర ప్రముఖులు శాలువాలతో సన్మానించారు.ఆ తర్వాత సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు మున్నూరు కాపు నాయకులు పాల్గొన్నారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed