ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు






**తేదీ: అక్టోబర్ 1, 2025 | స్థలం: ఖమ్మం
ఘనంగా ఏలూరి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు: సేవాభావంతో ఆసుపత్రి పేషెంట్లకు బ్రెడ్, పండ్ల పంపిణీ
టీజీవో రాష్ట్ర అధ్యక్షులు మరియు
టిజీఈజేఏసీ రాష్ట్ర (జాయింట్ యాక్షన్ కమిటీ) సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా టీఎన్‌జీవోస్ కమిటీ మరియు ఖమ్మం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి టిఎన్జీవోస్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా, ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులకు టీఎన్‌జీవో జిల్లా కమిటీ మరియు హాస్పిటల్ కమిటీ సభ్యులు ఏలూరి ద్వారా బ్రెడ్, తాజా పండ్లు పంపిణీ చేసి, వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు. ఈ కార్యక్రమం ఏలూరి గారి సమాజ సేవా స్ఫూర్తిని, ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయన అంకితభావాన్ని మరోసారి ప్రతిబింబించింది.
సేవలో అంకితం, పోరాటంలో అగ్రగామి
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, ఉద్యోగుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఏలూరి శ్రీనివాసరావు గారిని ఉద్యోగ సంఘాల నాయకులు హృదయపూర్వకంగా అభినందించారు. ఆయన నాయకత్వంలో TGEJAC మరింత బలోపేతమై, ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక విజయాలను సాధిస్తోందని పేర్కొన్నారు. “ఏలూరి గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఉద్యోగుల సేవలో మరింత శ్రేష్ఠమైన కృషి చేయాలని” ఆకాంక్షించారు.
ప్రభుత్వ ఆసుపత్రి లో కేక్ కట్ చేసి నిత్యం పేద ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది మధ్య ఆనందోత్సాలతో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో
టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి జైపాల్, దుర్గా ప్రసాద్,లలిత కుమారి,పెద్దినేని రాధాకృష్ణ, ప్రభాకర చారి, ఆంజనేయులు, కోనార్, రుక్మారావు, సుబ్బమ్మ, ముఖిద్, టీఎన్‌జీవో సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు .
