ఘనంగా గంగ భవాని బోనాలు
*ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఆగస్టు 10*



మున్నేటి నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని దేవాలయం నందు శ్రావణమాసం మూడవ ఆదివారం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే విధంగా గంగపుత్ర బెస్త సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. డప్పుల చప్పులతో పోతురాజుల విన్యాసాలతో మహిళలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని సామూహికంగా ఆలయానికి చేరుకొని చీర సారెలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కన్నం రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే విధంగా గంగమ్మ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని వేకువజామునే మున్నేరు నీటిని గంగమ్మకు అభిషేకించి, పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారని, గంగమ్మ తల్లి శాంతంగా ప్రవహిస్తూ పాడిపంటలు సమృద్ధిగా పండేలా ఆశీర్వదించాలని, మానవుల కు తాగునీరు సంతృప్తిగా అందాలని, మున్నేరు ఉగ్రరూపం దాల్చకుండా మానవ వనరులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నామని తెలిపారు . కార్యదర్శి గోధుమల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలంతా గంగమ్మ తల్లికి ఐకమత్యంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, కోరిన వారి కొంగుబంగారంగా అమ్మవారు అందరికీ ఆశీస్సులు అందిస్తుందని కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కన్నం వైష్ణవి, జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షులు కన్నం ప్రసన్న కృష్ణ, నగర అధ్యక్షులు చేతి కృష్ణ, మాజీ కౌన్సిలర్లు వంగాల వెంకట్ సింగం అంజయ్య జూబ్లీ పుర సారధి నగర్ సంఘం కోశాధికారి సోమనబోయిన కుమార్, నాయకులు చేతి శ్రీనివాస్, అంబటి రఘుబాబు, నరుగుల బలరాంశంకర్, పిల్లి ఐలేష్, అంబటి నవీన్ , పూస నరసింహారావు, కన్నం సందీప్, మైస కుమారస్వామి, పూజారి రాజు, కన్నం నరేందర్, తవిడబోయిన వీరేందర్, సోమనబోయిన సత్యం, మైస నవీన్, పిల్లి ఐలేష్, లెల్లల ప్రవీణ్, నరుగుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు
