అధికారులనే బురిడీ


అక్రమాలకు నిలయమైన ఎన్ జి వో సంస్ధ పై చర్యలు తీస్కోండి
=ఫోర్జరి సంతకాలతో బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేసినా చర్యలు నీల్
=అన్యాయాన్ని ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్న డిపిఎం
=ఉద్యోగాలను తీపిస్తామని బేదిరిస్తున్న డిపిఎం
=ది గాడ్ థేరిస్సా సంస్దపై ధ్వజమెత్తిన సభ్యులు
ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 5 )) వెంపటి నాయుడు
తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పరిధిలో పనిచేసే ది గాడ్ థేరిసా మహిళా మండలి నడిపించే రెండు ప్రాజెక్టులు అక్రమల పుట్టగా ఆ సంస్ధ సభ్యులైన ఆవుల నాగరాణి, కె ఉమా,పద్మ లు ఆరోపించారు.మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడ్తూ2005 నుండి తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొని, అవమానాలు భరించి కమ్యూనిటీ అభివృద్ధి కోసం ది గాడ్ థెరిసా మహిళా మండలి ఏర్పాటు చేసుకున్నామని. చాలా కార్యక్రమాలు చేపట్టామని దానిలో భాగంగా జిల్లాలోని హెచ్ఐవి , ఎయిడ్స్ నివారణ కొరకు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో ఇల్లందు , మణుగూరు ఏరియాల్లో హై రిస్క్ గ్రూపులు హెచ్ఐవి ని తగ్గించడానికి రెండు ప్రాజెక్టులు వచ్చాయని , అయితే ఈ సంస్ధ పి డి , మేనేజర్ ఇద్దరూ కలిసిఅనేక అవకతవకలకు పాల్పడ్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. సెక్స్ వర్కర్ల కు సేవలు చేసేందుకు ఈ ప్రాజెక్టు మంజూరైందని అయితే సెక్స్ వర్కర్లు కాని వారి పేర్లను,బినామి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించి దాదాపు 3వేల మంది ఉన్నారని తప్పుడు లేక్కలు చూపిస్తూ టి శాక్ నుంచి నిధులను పొందుతున్నారని వారు తెలిపారు.ఏటా రూ.25లక్షల నుంచి రూ.40లక్షల వరకు నిధులు వస్తాయని అయితే తప్పుడు నివేధికలు,తప్పుడు లేక్కలు చూపించి నిదులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.ఈ సంస్దలో ఉద్యోగులు పనిచేయకున్నా పని చేస్తున్నట్లు బినామి పేర్లతో జీతాలను డ్రా చేస్తున్నారని వారు పేర్కోన్నారు.ఈ సంస్ధ పి డి ఇల్లెందు ప్రాజెక్టులో దిగాడ్ థేరిసా సంస్ధకు గాని,బోర్డుకు గాని ఏమాత్రం సంబంధం లేని ఫణీశ్రీ అనే మహిళను సంస్ధ కోశాధికారిగా చూపించి ఆమెకే తెలియకుండా ఆమె పేరుతో ఇల్లెందు యూనియన్ బ్యాంక్ లో బినామి అక్కౌంట్ ఓపెన్ చేశారని దీనిపై తాము నిలదీస్తే తప్పు జరిగినట్లు ఫణి శ్రీ సంతకాలను ఫోర్జరీ చేయడం నా తప్పు అని కతీజా బేగం స్వయంగా అంగీకరిస్తూ సంస్ధకు రాతపూర్వకంగా తేలియజేసిందన్నారు.అసలు బోర్డులో నమోదు కాని బోర్డులో లేని ఫిణి శ్రీని ఈ సంస్ధకు కోశాధికారిగా ఎప్పుడు ఎన్నిక అయ్యిందో తెలియజేయాలని వారు కోరారు. ఫణి శ్రీ కూడా తన సంతకాలను ఫోర్జరి చేశారని యూనియన్ బ్యాంక్ కు ఫిర్యాదు కూడా చేశారని వారు అన్నారు. పోర్జరి సంతకాలపై తాము ఇల్లెందు,ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎఫ్ ఐ ఆర్ కూడా జారీ అయ్యిందని ,ఫోర్జరి సంతకాలు,అక్రమాల నేపధ్యంలో ఇల్లెందు,మణుగూర్ బ్రాంచ్ లోని సదరు సంస్ధ యూనియన్ బ్యాంక్ అక్కౌంట్లను బ్లాక్ చేశారని వారు వివరించారు
ఈ సంస్ధ ఏర్పాటు అయ్యి 15ఏళ్ళు దాటినా మహాజన సభలు నిర్వహించకుండా అప్పటి నుంచి కతీజా భేగమే అధ్యక్షురాలుగా కొనసాగుతుందని,బోర్డు మెంబర్ ఒక్కరు చనిపోయి మూడే ళ్ళు కావోస్తున్నా ఇప్పటి వరకు ఆమె స్దానంలో ఎవ్వరిని ఎంపిక చేయలేదన్నారు.తాము ఈ ప్రాజెక్టులోజరుగుతున్న అక్రమాలు,అవినీతి,మోసాలపై తాము ఖమ్మం,భద్రాద్రి జిల్లా కలెక్టర్ల కు ఫిర్యాదు చేయగా విచారణ ఆయా సంస్ధ నిర్వహించే ప్రాజెక్టులోవిచారణ జరిపించాల్సిందిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ టి -శాక్ పి డికి లేఖ కూడా రాశారన్నారు. విచారణ అనంతరం దీ గాడ్ థేరిసా మహిళా మండలి నిర్వహించే సంస్ధకు టి శాక్ నుంచి మంజూరు అయ్యే నిధుల విడుదలను,కిట్ల సరఫరాను నిలిపివేశారని ఈ విషయాన్ని స్వయంగా టి -శాక్ పి. డి పత్రికాముఖంగా ప్రకటించారని వారు గుర్తు చేశారు. స్వచ్చంధ సేవా సంస్ధల పనితీరును పర్యవేక్షించాల్సిన ఖమ్మం డిపిఎం అవినీతికికొమ్ముకాస్తూ అక్రమాలకు పాల్పడ్డ సంస్ధను వెనుకేసుకోస్తున్నాడని వారు ఆరోపించారు.ఇదేమని ప్రశ్నిస్తే మముల్ని అశ్లీల పదాలతో దూషిస్తూన్నారని తాము చేసుకున్న ఉద్యోగాలను తీపిస్తామని బెదిరిస్తూ ,తాము పనిచేసే సంస్ధ ని ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు.ఎన్జీవో సంస్ధలో పనిచేసే ఎంతోమంది మహిళలను డిపిఎం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ,జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఎన్ జీవో సంస్ధ పరిధిలోపనిచేసే ఒక మహిళా ఉద్యోగిని ఇదే విధంగా వేధిస్తే ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదు అయ్యిందన్నారు.టి -శాక్ లో ఉండే ఒక అధికారిని,డిపిఎం ని అడ్డం పెట్టుకోని మళ్ళీ ప్రాజెక్టులను తెచ్చుకోవాలని కతీజాబేగం చూస్తున్నారని వారు అన్నారు ఈ విషయం లో డిఏపిసియు ,డిపిఎం అక్రమ ఎన్జీవో కు సహకరిస్తూ కార్యక్రమాలను పక్కదారి పట్టిస్తున్నారని పేర్కోన్నారు.సిబ్బంది నియామకంలో అవకతవకలు చేస్తూ అర్హత లేని వారిని నియమిస్తూ ఇష్టరాజ్యాంగ ప్రవర్తిస్తున్నారని. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న కమ్యూనిటీ సభ్యులమైన మాపై దౌర్జన్యం చేస్తున్నారని వారు పేర్కోన్నారు ది గాడ్ తెరిసా మహిళా మండలి వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా కమ్యూనిటీ సభ్యులమైన మముల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ హెచ్ఐవి నివారణ కార్యక్రమాలకు అడ్డంకి కలిగిస్తున్నారని, దీనికి డీపీఎం పూర్తిగా సహకరిస్తూ కమ్యూనిటీ సభ్యులను అసభ్యంగా చిత్రీకరిస్తూ ప్రాజెక్టు బడ్జెట్ విషయాలలో వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పేర్కోన్నారు .ఈ విలేఖర్ల సమావేశంలో సంస్ధ సభ్యులు పద్మ రాణి,రమ,లక్ష్మి,సంజన ,భారతీ తదితరులు పాల్గొన్నారు.
