
రైతాంగానికి కొత్త శకం… మత్కేపల్లి AMC తో కొత్త దిశ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (Mathkepally AMC) ఏర్పాటు చేస్తూ ఫైనల్ జీవో విడుదల.!
ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 4 )) మధిర నియోజకవర్గం
మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ – రైతాంగానికి శుభవార్త!
చింతకాని & ముదిగొండ మండలాల రైతాంగం తరఫున భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!
చింతకాని మండలాన్ని ఖమ్మం మార్కెట్ నుండి విడదీసి,
ముదిగొండ మండలాన్ని నేలకొండపల్లి మార్కెట్ నుండి విడదీసి
ఈ రెండు మండలాల రైతుల సౌకర్యార్థం మత్కేపల్లి గ్రామంలో కొత్త గా మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు.!
ఇది రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, సమయానుసారమైన ధరలు మరియు ఈ ప్రాంతం అభివృద్ధికి దారితీయనుంది.
మధిర నియోజకవర్గ రైతుల ఆకాంక్షలు నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు గారికి కృతజ్ఞతలు.
మత్కేపల్లి గ్రామంలో మార్కెట్ కేటాయించడానికి సహకరించిన చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు గారికి చింతకాని మరియు ముదిగొండ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న మత్కేపల్లి గ్రామ ప్రజలు.
🌱 రైతు అభివృద్ధి – తెలంగాణ ప్రగతి! 🌱
చింతకాని & ముదిగొండ రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు!
భూమిని నమ్ముకుని పంటలు పండించే రైతు కష్టానికి గౌరవం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత,రైతు కష్టానికి గౌరవం ఇచ్చేలా, మార్కెట్ సౌకర్యాలను సమీపంలోనే అందించేందుకు మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశాం.
రైతు సంతోషమే రాష్ట్ర సుభిక్షానికి పునాది:
*– భట్టి విక్రమార్క deputy CM
