కలెక్టర్ దరఖాస్తులను సత్వర పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు



ప్రజావాణి దరఖాస్తులు సత్వర పరిష్కారం…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
*ఈ-ఆఫీస్ ద్వారా ఫైల్ మూమెంట్ జరగాలి
*జిల్లా రివ్యూ కమిటీ సమావేశాలకు నోట్స్ క్లుప్తంగా అందించాలి
*ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ అనంతరం అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, ఆగస్టు 04 (( మన జ్యోతి బ్యూరో )) వెంపటి నాయుడు
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు దొండపాటి రమేష్, టి. వెంకటేశ్వర్లు కొణిజర్ల మండలంతో పాటు వివిధ మండల గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల షెడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని, అట్టి పశువుల షెడ్లకు బిల్లులు చెల్లించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
వేంనూరు మండలం కల్లూరు గూడెం గ్రామ ప్రజలు తమ గ్రామంలోని ప్రజలకు పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండటం లేదని, తమ గ్రామంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
వైరా మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన రజియాబీ తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎంపిడిఓ కొణిజర్లకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
కొణిజెర్ల గ్రామానికి చెందిన సుంకర నరసింహారావు సర్వే నెంబర్ 271 లో అనుమతి లేకుండా వెంచర్ వేశారని, ఆ వెంచర్ వేయక ముందు అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మైనర్ పంట కాలువ ఉందని, అట్టి కాల్వను ఆక్రమించి వేసిన అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కొణిజర్లకు రాస్తూ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
వైరా మండలం గోవిందా పురం గ్రామానికి చెందిన చల్లా వెంకట రమణ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పి.డీ. హౌసింగ్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన ఎం.మనోజ్ కుమార్ తను బి ఫార్మసీ పూర్తి చేసుకున్నానని, ఖమ్మం జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధి కల్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మంత్రుల పర్యటనకు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. మంత్రుల పర్యటన సమయంలో సంబంధిత కార్యక్రమాల జిల్లా అధికారులు తమ వెంట శాఖకు సంబంధించిన నోట్స్ తో రావాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ఈ-ఆఫీస్ ద్వారా ఆన్ లైన్ లో ఫైల్ మూమెంట్ జరగాలని కలెక్టర్ తెలిపారు. 48 గంటలలో పరిష్కరించి తిరిగి పంపనున్నట్లు, తన దగ్గర ఫైల్స్ పెండింగ్ ఉండవని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తప్ప సాధారణ ఫైల్స్ మొత్తం ఈ-ఆఫీస్ లో ఉండాలని అన్నారు. ప్రతి బుధవారం సాయంత్రం 4.00 గంటలకు ఏదైనా ఫైల్స్ పై డిస్కషన్ ఉంటే వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రతి సమావేశానికి సంబంధించి మినట్స్ కాపీలను 24 గంటల్లో అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా రివ్యూ కమిటీ సమావేశాలకు అందించే నోట్స్ బ్రీఫ్ గా ఉండాలని, అనవసరమైన సమాచారం ఇవ్వవద్దని అన్నారు.
