సంక్రాంతి కల్లా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి, మార్కెట్ యార్డ్ ను అందుబాటులోకి తేవాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు

మార్కెట్ యార్డ్ ఆధునికీకరణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం, జూలై -21 మన జ్యోతి బ్యూరో

డిసెంబర్ లోగా మార్కెట్ యార్డ్ ఆధునికీకరణ పనులు పూర్తిచేసి, సంక్రాంతి కల్లా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రివర్యులు స్థానిక గ్రెయిన్ మార్కెట్ ఆధునికీకరణ పనులను సోమవారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఊరి బయట ఉన్న మార్కెట్, ఊరి మధ్యలోకి వచ్చిందని, రఘునాథ పాలెం మండలంలో 100 ఎకరాల్లో నిర్మించాలని తలచానని తెలిపారు. 20 డివిజన్ల ప్రజలు మిర్చి ఘాటు తో ఇబ్బంది పడేవారని,
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సీఎం ను ఒప్పించి గతంలో అనుమతి పొందానన్నారు. మద్దులపల్లి మార్కెట్ ను కూడ అందుబాటులోకి తెచ్చానని తెలిపారు. ఈ మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలని మంత్రి అన్నారు. మన మార్కెట్ ను దేశంలోని అన్ని మార్కెట్లు దిక్సూచి గా తీసుకోవాలన్నారు.

రైతులకు ఎలాంటి నష్టం జరగొద్దని, అవన్నీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశానని తెలిపారు. ఎగిలిటి కంపెనీ నమ్మకమైన కంపెనీ అని, డిసెంబర్ చివరి వరకు గడువు ఇచ్చినట్లు, ఆలోగా పనులన్నీ పూర్తి అవ్వాలన్నారు. సంక్రాంతి పండుగ రోజు రైతులు పంట ఉత్పత్తులు తెచ్చి వ్యాపారం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.

ఇతర రాష్ట్రాలు, దేశాల వారీగా వచ్చే వ్యాపారులు ఎగుమతి, దిగుమతి కూడా ఇక్కడే జరిగేట్లు చర్యలు చేపడుతున్నామన్నారు. పనులపై అధికారులు పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలన్నారు. రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని తెలిపారు. పండించిన పంటకు భద్రత కల్పించాలన్నారు.

5 నెలల గడువులోగా మోడల్ మార్కెట్ ను అందివ్వాలని మంత్రి తెలిపారు. మార్కెట్ కు వచ్చే భారీ వాహనాల వల్ల రోడ్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అందుకుగాను ప్రజల గుడిసెలు తొలగించి, వారికి పునరావాసం కల్పించేందుకు స్థలం చూసి ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ వెంకటేశ్వర రావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed