ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో జులై 18 )) వెంపటి నాయుడు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి,మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు.కేటీఆర్ పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను శుక్రవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా కేటీఆర్ ఖమ్మం మమతా వైద్య కళాశాల ప్రాంగణంలోని మాజీ మంత్రి అజయ్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయన తండ్రి, సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావుతో కొద్దిసేపు ఇష్టాగోష్టి జరిపారు,యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, చంద్రావతి తదితరులు ఉన్నారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed