ఖమ్మం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం లో బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ రామసహాయం రాఘరాం రెడ్డి గారితో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లకగా రేవంత్ రెడ్డి పాలన ఉందన్నారు.ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన చెప్పారు.పాలేరు నియోజకవర్గంలో ఇళ్ళు, రేషన్ కార్డులు ఇవ్వడం లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆయన అన్నారు..






