ఖమ్మం కార్పొరేషన్ జూన్ 29 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ))


ఇటీవల నియమించిన మున్నూరు కాపు సంఘం డివిజన్ కమిటీలలో భాగంగా 46వ డివిజన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నియమితులైన వేముల సత్యనారాయణ గారిని 46 డివిజన్ కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కార్యదర్శిగా నియమితులైన బొబ్బూరి చైతన్య గారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిగా సారధి నగర్ లో నివాసం ఉంటూ మున్నూరు కాపు సంఘ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్నందున వారిని అభినందిస్తూ రానున్న కాలంలో మా పూర్తి సహకారం ఉంటుందని 46 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ రజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాంపాటి వెంకటేశ్వర్లు, సెల్వం జ్ఞానేశ్వర్ , చేతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
