సిపిఐ సిపిఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్ సహాయ కార్యదర్శిగా జమ్ముల జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు రెండు రోజులపాటు మదిరలో జరిగిన 23వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి మహాసభలలో 91 మందితో కౌన్సిల్ ను 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో సాంప్రదాయ కమ్యూనిస్టు కుటుంభం లో జన్మించారు విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో పనిచేసిన సురేష్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ 23వ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో జన్మించారు విద్యార్థి యువజన ఉద్యమాలలో పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంలో సుదీర్ఘకాలం జిల్లా రాష్ట్ర బాధ్యతలను నిర్వర్తించారు ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు, వీరిద్దరు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు భాగం హేమంతరావు మహమ్మద్ మౌలానా తదితరులు నూతన నాయకత్వాన్ని అభినందించారు

ByNaidu

Jul 20, 2025

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed