#..పోలీస్, రెవిన్యూ అధికారులు సీజ్ చేసిన డంపులూ మాయం..#

వేలంపాటరోజే అధికారులకు ఝలక్.
సీజ్ చేసిన ఇసుకకు రక్షణ చర్యలు చేపట్టని సంబంధిత అధికారులు.
*తిరుమలాయపాలెం (( మన జ్యోతి ప్రతినిధి జూలై 19 ))
పట్టుబడిన ఇసుక డంప్ లు మాయమైన వ్యవహారం తిరుమలాయపాలెం మండలం ముజాహిద్ పురం రెవిన్యూ శివారులో చోటుచేసుకుంది. మూల మర్రి తండా ఇసుక ట్రాక్టర్ల ఓనర్లతో ముజాహిద్ పురం గ్రామాలనుంచి అనుమతులు లేకుండా తరలిస్తున్న కొందరు ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల సన్నిహిత సంబంధాలే ఈ వ్యవహారానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ పోలీస్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి ఈనెల 15వ తారీఖున దాడి చేసి సుమారు 30 ట్రాక్టర్ల ఇసుక నిలవలను మార్కింగ్ పెట్టుకున్నారు. శనివారం ఇసుక బహిరంగ వేలం పాట ఉంటుందని పాల్గొనదలచిన వారు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి పాల్గొనవచ్చని మండల తహసిల్దార్ ప్రకటన కూడా విడుదల చేశాడు. కానీ సీజ్ చేసిన ఇసుకకు రక్షణ చర్యలు లేక రాత్రికి రాత్రి 30 ట్రాక్టర్ల ఇసుక మాయం చేశారు.
ఇసుక అక్రమ నిల్వ చేసింది ఎవరు ?.
అధికారులు ఎంతసేపు అక్రమంగా డంపు చేసిన ఇసుకను సీజ్ చేసేందుకు ఆసక్తి చూపించారేగాని ఇంతకూ ఇసుకను నిల్వలు చేసింది ఎవ్వరు ? అనే దాన్ని పట్టించుకోలేదు. దీని పట్ల పలు అనుమానాలు ఉన్నాయి. అక్రమంగా పాలేరు వాగు నుంచి ఇసుక డంపు చేసిన వాళ్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
`info@మన జ్యోతి జర్నలిస్ట్
