మహబూబ్ నగర్ టౌన్ (( మన జ్యోతి ప్రతినిధి జులై 05 ))

మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు నెంబర్ 5 కు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బి.అజయ్ కుమార్ వారి తండ్రిగారైన కీర్తి శేషులు ధన్ పాల్ (సూపరింటెండెంట్ DMHO ఆఫీస్ ) జయంతిని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణం లోని ఏనుగొండ లో నిర్వహిస్తున్న సన్నిధి అనాదాశ్రమం లో చిన్నారులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయంతి లను వర్థంతిలను పురస్కరించుకుని విరివిరిగా పట్టణంలోని ప్రముఖులు సన్నిధి ఆశ్రమంలో చిన్నారులతో జరుపుకోవాలని ఆయన సూచించారు. అవకాశం ఉన్నవారు అనాదాశ్రమం లో ఉన్న పిల్లలను దత్తత తీసుకొని,వారి అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. అనంతరం చిన్నారులతో కలిసి ఆయన భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో వడే శివ కుమార్ ,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed