ఖమ్మం, జూలై 19 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు

ఖమ్మం నగరంలోని 11వ డివిజన్ వరదయ్య నగర్ లో శనివారం లయన్స్ క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో నిరుపేదలకు, కష్టజీవులకు, శ్రామికులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం లయన్స్ క్లబ్ అధ్యక్షులు, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కే జగదీష్ బాబు, జోన్ చైర్మన్ డాక్టర్ బి.ఎస్.రావు, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దుర్గా నాగేశ్వరరావు, ట్రెజరర్ కృష్ణమూర్తి, లయన్ కొంకిమళ్ల విశ్వేశ్వరరావు, డాక్టర్ డి పి సి రావు, వి వెంకయ్య, వి హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులు డాక్టర్ కే జగదీష్ బాబు, డా.బీఎస్ రావు తదితర ప్రముఖులు మాట్లాడుతూ…. అన్నదానం మహాదానం అన్నారు. సమాజంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు. ప్రపంచంలో ఎవరూ ఆకలి చావులకు గురి కాకూడదని లయన్స్ క్లబ్ భావిస్తుందన్నారు. అందుకే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం చేయడం ఒక ప్రధాన కర్తవ్యం గా భావిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం ఎదుటివారిని ఆదుకునేందుకు తమ వంతుగా కృషి చేయాలన్నదే లయన్స్ క్లబ్ ప్రధాన కర్తవ్యం అని వారు అన్నారు. పేదలకు అన్నదానం చేయడం తమకు ఎంతో ఆనందం కలిగించిందని వారు తెలిపారు. రాబోవు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి లయన్స్ క్లబ్ సేవలను ప్రజలకు చేరువ చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని పలువురు పాల్గొన్నారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed