రఘునాథపాలెం/05-12-2025

మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు రఘునాథపాలెం ఖమ్మం

రఘునాథపాలెం మండలం అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే…మాజీ మంత్రి పువ్వాడ..

బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలవాలి…

ఎన్నికల్లో పోరాడి గెలవాలి కానీ బెదిరింపులతో ఏకగ్రీవం చేయాలనుకున్న కాంగ్రెస్…

అధికారం శాశ్వతం కాదు ప్రజల్లో ఉండాలి..పదేళ్ల పాలనలో మండలాన్ని సుందరంగా తీర్చిదిద్దిన…మాజీ మంత్రి పువ్వాడ..

మండలంలో కాంగ్రెస్ పార్టీ నుండి పలు కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక..

రఘునాథపాలెం మండలం చిమ్మపూడి,పాపటపల్లి, చింతగుర్తి,గణేశ్వరం,వేపకుంట్ల,వివి పాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొన్నారు.

అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీలను,కొత్త మండలాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిదే..

గత పదేళ్ల పాలనలో రఘునాథపాలెం మండలం అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపాను.అన్ని రకాల నిధులతో మండలంలో మట్టి రోడ్లను సిసి రోడ్లు చేసి అన్ని డొంక రోడ్లను బిటి రోడ్లుగా మార్చి,డ్రైన్లు,నాలుగు లైన్ల రహదారులు,డబుల్ బెడ్ రూములు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి ప్రగతి పదంలో ముందున్నాం..

ఆరు గ్యారంటీలు పేరుతో రైతు రుణమాఫీ,రైతు భరోసా,
అత్తకు 4000పెంక్షన్,కోడలికి 2500,ఆడపిల్లలకు స్కూటీలు,కల్యాణ లక్ష్మి తులం బంగారం,మహాలక్ష్మి పథకమంలో గ్యాస్ ఇస్తామని మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు.

వ్యవసాయ శాఖా మంత్రి ఉన్న ఈ నియోజకవర్గంలో యూరియా కూడా రైతులకు అందించలేకపోయారు.
రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానని ఇప్పుడు వారికి మీటర్లు పెడుతున్నారు.

ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఇలాంటి మోసాలను ప్రజలకు వివరించాలని అన్నారు.

ఈ కార్యాక్రమంలో మండల అధ్యక్షులు వీరునాయక్,మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాఘభూషణం,టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్ర రెడ్డి,కార్పొరేటర్లు వలరాజు,
జస్వంత్,మచ్చా నరేందర్ సర్పంచ్ అభ్యర్థులు గుత్తా రవి,కొండపర్తి లక్ష్మి మల్లికార్జున్,కొంటెముక్కల వెంకటేశ్వర్లు,తాత కళావతి వెంకటేశ్వర్లు,కొర్ర శ్రీను,పొట్లపల్లి రమాదేవిరాజా,కుతుంబాక నరేష్ నాయకులు హరిప్రసాద్,,మెంటం రామారావు,ప్రదీప్,దొంతు సత్యం,శ్రీనివాస్,సైదులు,భద్రయ్య,యాస రామారావు,శ్యామ్, దానయ్య,రామోజీ,కీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed