హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ జూన్ 29 వేదిక జలవిహార్


మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులకు ఉత్సాహభరిత వాతావరణంలో సజావుగా, పారదర్శకంగా,ప్రశాంతంగా జరిగాయి.హైదరాబాద్ జలవిహార్ ప్రాంగణంలో ఆదివారం మున్నూరుకాపు సంఘం అత్యున్నత నిర్ణాయక మండలి అయిన అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యాన నియమింపబడిన కమిషన్ ఈ ఎన్నికలను ప్రజాస్వామిక పద్ధతిలో, అందరికి ఆమోదయోగ్యంగా జరిపించడం జరిగింది.ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా సర్థార్ పుటం పురుషోత్తమ రావు పటేల్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది పెంటయ్య పటేల్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా కంచె సత్యనారాయణ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.ఎన్నికల ప్రధానాధికారిగా ఐపీఎస్ మాజీ అధికారి జే.డీ.లక్మీనారాయణ,ఆయనతో పాటు ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారి మంగపతిబాబు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఎర్రా నాగేంద్రబాబు,న్యాయ సలహాదారులు సీనియర్ అడ్వకేట్లు ఊసా రఘు, లవంగాల అనిల్ వ్యవహరించారు.సంఘం అధ్యక్షులుగా పురుషోత్తమ రావు, ప్రధాన కార్యదర్శిగా పెంటయ్య, కోశాధికారి సత్యనారాయణల చేత ఎన్నికల ప్రధానాధికారి లక్ష్మీనారాయణ ప్రమాణం చేయించి,పత్రాలు అందజేశారు.సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా వేణుగోపాల్ పటేల్, డాక్టర్ జే.ఏన్.వెంకట్ పటేల్,చల్లా హరిశంకర్ పటేల్,మహిళా విభాగం అధ్యక్షురాలుగా బండి పద్మక్క పటేల్ ను అపెక్స్ కౌన్సిల్ నియమించి, వారికి పత్రాలు అందజేయడం జరిగింది.ఎన్నికైన, నియమితులైన వారిని పలువురు శాలువాలతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
