మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరు లో పర్యటించిన ఎమ్మెల్యే రాగమయి
*సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జూలై 19*
కల్లూరు మండలంలోని కల్లూరు మున్సిపాలిటీ మరియు నారాయణపురం శ్రీరామపురం,ముచ్చవరం,చెన్నూరు రావికంపాడు,పెద్ద కోరుకొండి, చిన్న కోరుకొండి ఈ గ్రామాలలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిని చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ *
➡️ ఆడబిడ్డ పెళ్లిచేసిన తల్లిదండ్రులు ఆర్థిక చేయూత కింద పెళ్లయిన కొద్ది రోజులకే వారి ఇంటికి వెళ్లే కళ్యాణ లక్ష్మీ చెక్కులు వారి తల్లిదండ్రులకు అందిస్తున్న ఎమ్మెల్యే , స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి చెక్కలు ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు.
➡️ లబ్ధిదారులకి కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటూ వారి బాగోగులు తెలుసుకొని వారి సమస్యలు వెనీ వారి ఇంట్లోనే వారి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది.
మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను భావించి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన మీకు ఎప్పుడు తోడుగా ఉంటానని, మీ ప్రతి కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటానని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ, స్థానిక నాయకులకి కూడా వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు.
మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు ఫోన్ చేస్తే పని చేసి పెట్టే బాధ్యత నాది అని ప్రజలకు చెప్పి వారి గుండెల్లో మనోధైర్యాన్ని నింపుతున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద .
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ చౌదరి , కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.
నన్ను అభిమానంతో గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాల్గొంటానని ప్రజలకి హామీ ఇచ్చారు

