రాష్ట్ర మంత్రి తుమ్మల గారిని కలిసిన అశ్వరావుపేట శాసనసభ్యుడు ఆదినారాయణ
భద్రాద్రి జిల్లా మే 30 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు
దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అశ్వరావుపేట శాసనసభ్యుడు జారే ఆది నారాయణ కలిశారు. అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని ఉన్న పలు సమస్యలను మంత్రి తుమ్మల దృష్టికి తీసుకువచ్చిన జారే ఆదినారాయణ ఇతర మంత్రులతో మాట్లాడి అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి తుమ్మల గారు జారే ఆదినారాయణ గారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాసాని నాగప్రసాద్ అచ్యుతరావు తదితరులు ఉన్నారు.
