ప్రపంచ ఆదివాసి దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం నియోజకవర్గం.
భద్రాచలం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 9 ))
భద్రాచలంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పటేల్ , ఐటిడిఏ పిఓ శ్రీ రాహుల్ , సబ్ కలెక్టర్ శ్రీ మృణాల శేష్ట , తదితర ఆదివాసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదివాసి సంప్రదాయాలతో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదివాసీ సంఘ నాయకులు ముఖ్య అతిథులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారిని, ఐటిడిఏ పిఓ శ్రీ రాహుల్ గారిని, సబ్ కలెక్టర్ శ్రీ మృణాల శేష్ట గారిని శాలువాలతో సత్కరించారు.





ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొ
