









అన్నం పరబ్రహ్మ స్వరూపం
- బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ దేవభక్తుని కిషోర్ బాబు
- దేవభక్తుని ఆధ్వర్యంలో మహా అన్నదానం
ఖమ్మం:(( సెప్టెంబర్ 4 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు )) - అన్నం పరబ్రహ్మస్వరూపమని, ఎదుటివారి కడుపు నింపేందుకు అన్నదానం చేయడం దేవుడు తనకిచ్చిన అదృష్టమని బీఆర్ఎస్ ఖమ్మం నగర యూత్ ప్రెసిడెంట్ దేవభక్తుని కిషోర్ బాబు అన్నారు. ఖమ్మంలోని 8వ డివిజన్ గోపాలపురం రామాలయం నందు గల వినాయకుని మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని దేవభక్తుని కిషోర్ బాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. అనంతరం ఎల్బీనగర్ కొత్త కాలనీ, వైయస్సార్ కాలనీలోని డబల్ బెడ్ రూమ్ ల నందు గల వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమానికి కిషోర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ గణేష్ నవరాత్రులను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారని, అన్నదాన కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ నవరాత్రుల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని తెలిపారు. కులమతాలకు అతీతంగా భక్తులు నవరాత్రులను విజయవంతం చేశారని, వారికి అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. అందుకోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు వాంకుడో సురేష్ నాయక్, బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ నాయకులు కందాల వీరేంద్ర గౌడ్, 8వ డివిజన్ నాయకులు జాలఅభిజిత్, వడ్రానపు శీను,చింతల భాస్కర్, అజ్మీర్ గాంధీ, రామ కృష్ణ, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, పమ్మి రమేష్, రాము, సతీష్, పాషా, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
