ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 6 )) వెంపటి నాయుడు
దాసలాపురం లో ని ఆచార్య జయశంకర్ వారధి వద్ద గల జయశంకర్ సార్ విగ్రహం వద్ద తెలంగాణ విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ మాతృ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు అద్దంకి నాగేశ్వర రావు,ప్రధాన కార్యదర్శి పెందోట సోమేశ్వరా చారి,ఉపాధ్యక్షులు విజయగిరి సదానందా చారి,కోశాధికారి వెగ్గలం వెంకటేశ్వర్లు, నాయకులు ఇనుగుర్తి వెంకటేశ్వర్లు,విశ్వనాథుల పాపా చారి,గంటల తిరుపతా చారి నగర అధ్యక్షులు గౌరోజు వసంత్ బాబు,కోశాధికారి నందిగామ వీరబ్రహ్మ చారి,నేలకొండ వీరాచారి,డాక్టర్ ఎంఎం చారి,వీరభద్రం,నాగార్జునపు బ్రహ్మాం తదితరులు పాల్గొని సారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అద్దంకి నాగేశ్వర రావు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన తన ఊపిరిగా తొలి ఉద్యమం నుండి మలి ఉద్యమానికి దిశా,దశ నిర్దేశం చేసి తనదైన ఎత్తుగడలతో ఉద్యమ నాయకులకు సూచనలు సలహాలు ఇస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపిన గొప్ప సింధాంతకర్త అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో సారు తో పాటు 36 మంది విశ్వబ్రాహ్మణ యువకులు ఆత్మ బలిదానాలతో ఏర్పడిన స్వరాష్ట్రంలో 12 సంవత్చ రాలలో విశ్వబ్రాహ్మణులకు ఒరిగినది ఏమీలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్లు పాలక వర్గాన్ని నియమించి దానికి 2000 కోట్ల రూపాయలను కేటాయించాలని,తద్వారా విశ్వబ్రాహ్మణ చేతి వృత్తులను ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed