ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఫిబ్రవరి 1
- కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల
ఖమ్మం, : ఖమ్మంలో నూతనంగా ఏర్పాటు చేసిన కూరపాటి మల్టీ స్పెషాలిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ను ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరపాటి ప్రదీప్ కుమార్ వైద్య రంగంలో అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటు ధరలో అందిస్తున్న ఘనత కూరపాటికే దక్కుతుందన్నారు. కూరపాటి చిల్డ్రన్ హాస్పిటల్ పేరుతో జిల్లా ప్రజలందరికీ సుపరిచితమైన ప్రదీప్, వైద్యరంగమే కాకుండా, క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమన్నారు. తలసీమియా పిల్లలకు ఉచిత వైద్యంతోపాటు, రక్తం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ప్రదీప్ కుమార్ తండ్రి కూరపాటి వెంకటేశ్వర్లు తనకు ఎంతో కాలం నుండి సుపరిచితులని, రాజకీయాల్లోనూ, వ్యాపార రంగంలోనూ రాణిస్తూ తనదైన ముద్ర వేశారని అన్నారు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ ప్రదీప్ కుమార్ ఖమ్మం జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ హాస్పిటల్ ద్వారా జిల్లా ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మిక్కిలి నేని నరేందర్, కాంగ్రెస్ నాయకులు ముక్తార్, ఖమ్మం కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, చింతనిప్పు కృష్ణచైతన్య, ప్రముఖ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.





