• నిమ్స్ లో మోకాలి శస్త్ర చికిత్సకు
    రూ. 75,000 కేటాయింపు

ఖమ్మం: మే 30 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు

పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గాంధీ నగర్ కు చెందిన కొలకాని పరిమళ అత్యవసర వైద్య చికిత్స కు ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) ద్వారా రూ. 75 వేలకు ఎల్ వోసీ పత్రం మంజూరైంది. ఇటీవల బాధితురాలు ఎంపీ ని కలిసి మోకీళ్ళ నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నానని, ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంది. వెంటనే స్పందించిన ఎంపీ రఘురాం రెడ్డి.. ప్రత్యేక శ్రద్ధ చూపి హైదరాబాద్ లోని నిమ్స్ లో మోకాలి శస్త్ర చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 75,000లను మంజూరు చేయించారు. ఈ మేరకు శుక్రవారం ఎల్ వోసీ మంజూరు పత్రాన్ని హైదరాబాద్ లోని తన నివాసంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు.. ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed